దిశ అంబాసిడర్స్ కు ప్రత్యేక బహుమతులు అందజేసిన ఎస్పీ మలిక గర్గ్
ప్రతి ఒక్కరూ దిశా అంబాసిడర్స్ గా మారి మహిళా భద్రతలో పెంచుటలో భాగస్వాములు కావాలని పిలుపు.
మహిళా భద్రతా కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దిశ యాప్ ను జిల్లాలో ఉన్నయువతులకు, మహిళలకు మరింత దగ్గర చేయాలనే సంకల్పంతో ప్రకాశం జిల్లా ఎస్పీ మౌలిక గర్గ్ వినూత్నమైన ఆలోచనతో దిశ అంబాసిడర్స్ అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జిల్లాలో గత ఐదు రోజుల్లో 50 కు పైగా దిశ యాప్ రిజిస్ట్రేషన్స్ చేయించి దిశ అంబాసిడర్స్ గా నిలిచిన పొదిలికి చెందిన బి ఆది లక్ష్మి (138 డౌన్లోడ్స్), పెద్దనలకలువకు చెందిన ఎల్. ఎస్తేరు రాణి ( 100 డౌన్లోడ్స్), ఒంగోలుకు చెందిన సిఎచ్. రత్నకుమారి ( 66 డౌన్లోడ్స్) లకు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ శుక్రవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సంధర్భంగా ఎస్పీ మలిక గర్గ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలు రక్షణ పొందేందుకు దిశ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోని, పేరు, అడ్రెస్స్, అత్యవసర కాంటాక్ట్ నెంబర్లు వంటి వివరాలతో రిజిష్టర్ చేసుకోవాలని, ఆపద సమయంలో యువతులు, మహిళలు దిశ యాప్‌లో ఉన్న SOS బటన్ నొక్కినా లేదా ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపినా పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తక్షణం సమాచారం వెళ్ళుతుందని తద్వారా పోలీస్ లు వెనువెంటనే రక్షణ అందిస్తారని తెలిపారు.
మహిళా భద్రతా పెంచుటలో తమ వంతు పాత్ర పోషించుటకు ప్రతి ఒక్కరూ దిశ అంబాసిడర్ గా మారాలని పిలుపునిచ్చారు.
జిల్లా ప్రజలలో ఎవరైనా 50 కన్నా ఎక్కువ మందితో దిశా అప్ ను డౌన్లోడ్ చేయిస్తే వారిని “దిశా అంబాసిడర్ లు”గా గుర్తించి వారికి మంచి బహుమతులు అందజేస్తామని తెలిపారు.
ఎక్కువ సంఖ్యలో దిశా యాప్ డౌన్ లోడ్ చేయించిన వారికి రాష్ట్ర స్ధాయి పోలీస్ ఉన్నతాధికారులచే ప్రత్యేక బహుమతులు కూడా అందజేయటం జరుగుతుందని తెలిపారు.
దిశా అంబాసిడర్లు అవ్వాలి అనుకొనే వారు IT CORE ఎస్సై ఫోన్ నెంబర్ 9121102277 ద్వారా సంప్రదించి వారి పేరును రిజిస్టర్ చేయించుకోగలరు. వారు చేయించిన దిశా యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ వివరాలు మరియు ఫోన్ నెంబర్లను 9121102277 కు వాట్స్ యాప్ చేయవలెను.
అనంతరం ఆ వివరాలను దిశా యాప్ డేటాబేస్ లో వెరిఫై చేసి ఎక్కువ డౌన్లోడ్స్ చేసిన వారిని జిల్లా ఎస్పీ దిశ అంబాసిడర్స్ గా గుర్తిస్తారని తెలిపారు.