ప్రకాశం జిల్లా రక్షణ అధికారి సిద్దార్థ్ కౌషల్ ను లాల్ ఫౌండేషన్ చైర్మన్ ఆఖిబ్ అహ్మమద్ మరియు కాంట్రాక్టర్ తాతా సత్యం మంగళవారంనాడు మర్యాద పూర్వకంగా కలిశారు.
వివరాల్లోకి వెళితే జిల్లా రక్షణ అధికారి సిద్దార్థ్ కౌషల్ మహిళా రక్షణార్ధం తలపెట్టిన అభయ్ వాహనాల ఏర్పాటుపై ఆకర్షితులైన లాల్ ఫౌండేషన్ చైర్మన్ అఖిబ్ అహ్మమద్ పొదిలి ఠాణాకు అభయ్ స్కూటీని బహుమతిగా అందేజేసిన విషయం విధితమే…..
బుధవారంనాడు ఠాణాకు ద్విచక్రవాహనం అందించిన అనంతరం మంగళవారంనాడు యస్పీ సిద్దార్థ్ కౌషల్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్ మాట్లాడుతూ లాల్ ఫౌండేషన్ ద్వారా మరెన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపినట్లు వారు తెలిపారు.