మంచి నీటి సరఫరా కోసం ప్రత్యేక చర్యలు- కమీషనర్ డానియల్ జోసప్
పొదిలి మున్సిపల్ పరిధిలోని మంచి నీటి సరఫరా కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ అన్నారు.
మంగళవారం నాడు స్థానిక పొదిలి మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ మాట్లాడుతూ పొదిలి మున్సిపల్ పరిధిలోని కంభాలపాడు,నందిపాలెం, మాదాల వారి పాలెం,పోతవరం , రాజు పాలెం, కాటూరి వారి పాలెం నందు నీటి సరఫరా కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని రేపటి నుంచి అదనపు ట్రిప్పులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు.
మున్సిపల్ పరిధిలోని ఎక్కడా నీటి సరఫరా ఉన్న తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారం చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో ఎఇ రవీంద్రుడు తదితరులు పాల్గొన్నారు