సచివాలయలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ప్రత్యేక అధికారాలు
పొదిలి పట్టణంలోని 4వ సచివాలయాన్ని మార్కాపురం నియోజకవర్గం ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో లోని బృందం ఆకస్మికంగా
తనిఖీలు నిర్వహించారు.
అనంతరం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి సమీక్షించారు.
అనంతరం మార్కాపురం నియోజకవర్గం ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి అవగాహన కల్పించేందుకు ఉప్పలపాడు, తలమల్ల సచివాలయం ల్లో మరియు గోగినేని వారి పాలెం నందు అవగాహన సదస్సులు నిర్వహించి లబ్దిదారులకు అవగాహన కల్పించమని సంబంధిత లబ్దిదారులు డిసెంబర్ 21 ప్రభుత్వం నిర్ణయించిన రూసుం చెల్లించి శాశ్వత హక్కులు పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రత్యేక అధికారి మల్లారెడ్డి, మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, నగర పంచాయితీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి ఆర్ ఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు