ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దారు పిలుపు

పొదిలి పట్టణంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లోని పొలింగ్ బూత్ లను మండల రెవెన్యూ తహశీల్దారు దేవీప్రసాద్ సందర్శించారు.

ఈ సందర్భంగా తహశీల్దారు దేవీప్రసాద్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు నవంబర్ 20,21 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ బూత్ అధికారులు అందుబాటులో ఉంటారని 18 సంవత్సరం నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని అదే విధంగా ఓటర్ల జాబితాలో ఫోటోలు సరిగా లేకపోతే వాటి నందు కొత్త ఫోటోలు నమోదు చేయటం తొలగింపు, చేర్పులు, అడ్రస్ మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉందని కావునా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తహశీల్దారు వెంట మండల రెవెన్యూ సర్వేయర్ బ్రహ్మం, అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిలారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు