ఆర్యవైశ్య మహిళా విభాగ్ జిల్లా అధ్యక్షురాలిగా సోమిశెట్టి శ్రీదేవి
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగ్ ప్రకాశం జిల్లా అధ్యక్షురాలిగా సోమిశెట్టి శ్రీదేవిని నియమిస్తూ ప్రపంచ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో మహిళా విభాగ్ సంస్థను జిల్లాలో పటిష్టపరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. తనకు పదవి లభించుటకు కృషి చేసిన నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.