రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన శ్రీనివాసులు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు రిమ్స్ వారి సౌజన్యంతో స్థానిక పొదిలి విశ్వనాథపురంలోని యస్ఆర్ కళ్యాణ మంటపం నందు ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరాన్ని పేరసామల శ్రీనివాసులు బెల్లంకొండ విజయలక్ష్మి లాంచనంగా ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసైనికులు రక్తదానం శిబిరంలో నందు రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ న్యాయ విభాగం జిల్లా కార్యదర్శి వరికుటి నాగరాజు పట్టణ నాయకులు షేక్ కలేషా మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.