ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వివేక్ యాదవ్

   గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వివేక్ యాదవ్ పరిశీలించారు.


వివరాల్లోకి వెళితే ఎన్నికల నిర్వహణపై పరిశీలించడానికి జిల్లా కు వచ్చిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ పొలా భాస్కర్ లో బృందం సోమవారం నాడు పొదిలి మండలం పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ పొలా భాస్కర్ మాట్లాడుతూ నామినేషన్లు దాఖల సమాహయంలో అభ్యర్థులతో వ్యవహరించేవలసిన తీరుపై అవగాహన కల్పించారు

2019 ఓటర్ లీస్ట్ ద్వారా ఎన్నికలు జరగనున్నాయిని దానిని దృష్టిలో ఉంచుకుని పని చెయ్యాలని అదే విధంగా పోలింగ్ బాక్స్ లు మరియు సమస్యాత్మకంగా గురించి వాటి పై తీసుకున్న చర్యల గురించి రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వివేక్ యాదవ్ అడిగి తెలుసుకుని స్థానిక అధికారులు పలు సూచనలు చేశారు

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ హనుమంతరావు, యస్ఐ సురేష్, ఈఓఆర్డీ రాజశేఖర్, మరియు మండల స్థాయి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు