ఇసుక అక్రమ రవాణా పై ఉక్కుపాదం 8 ట్రాక్టర్లు 1 జెసిబి స్వాధీనం
ఇసుక అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపి 8 ట్రాక్టర్లు 1 జెసిబి స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం నాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే చిమట వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతుందని సమాచారంతో మర్రిపూడి యస్ఐ సుబ్బారాజు ఆధ్వర్యంలో దాడి చేయగా 7 ట్రాక్టర్లు 1 జెసిబి స్వాధీనం చేసుకొని మర్రిపుడి పోలీసు స్టేషన్ కు తరలించారు.
అదే విధంగా పొదిలి మండలం యేలూరు గ్రామంలో శివాలయం దగ్గర ట్రాక్టర్ నందు 4 టన్నుల ఇసుక ను అక్రమంగా తరలిస్తున్న సమయం లో యస్ఇబి అధికారులు దాడి చేసి ట్రాక్టర్ ను ఒక వ్యక్తి అరెస్టు చేశారు.
రెండు వేరు వేరు దాడుల్లో పొదిలి యస్ఇబి సిఐ వెంకట్రావు, మర్రిపూడి యస్ఐ సుబ్బారాజు, పోలీసులు సిబ్బంది మరియు యస్ఇబి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు