వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు : కేంద్ర మంత్రి
దేశవ్యాప్తంగా పని చేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి జవదేకర్ అన్నారు.
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పని చేస్తున్న వైద్య సిబ్బంది మరియు కార్యకర్తలపై దాడులు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి 50వేల నుండి 2లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందని…… తీవ్రంగా గాయపడితే 1లక్ష నుండి 5లక్షల రూపాయలు వరకు జరిమానాలు అదేవిధంగా కేసు 30రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 5సంవత్సరాల జైలుశిక్ష విధించే విధంగా…… ఒకవేల వైద్యసంస్థ వాహనాలను ధ్వంసం చేస్తే రెండు రెట్లు నష్ట పరిహారం మరియు జరిమానాలు విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకుని వచ్చిందని……
అదేవిధంగా వైద్య సిబ్బందికి ఎన్ 95 మాస్కులు ప్రస్తుతం 25లక్షలు అందుబాటులో ఉన్నాయని మరో 50లక్షల మాస్కులు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జావదేకర్ మీడియా సమావేశంలో తెలిపారు.