కర్ఫ్యూ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సిఐ శ్రీరాం
కర్ఫ్యూ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదిలి సిఐ శ్రీరాం హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలలో భాగంగా రెండవ రోజు కర్ఫ్యూ అమలును పొదిలి సిఐ శ్రీరాం, నగర పంచాయతీ కమీషనర్ భవాని ప్రసాద్ లు పర్యవేక్షించారు
ఈ సందర్భంగా సిఐ శ్రీరాం మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎలాంటి పనులైన, ప్రయాణాలు అన్ని మధ్యాహ్నం 12 గంటల లోపల చూసుకోవాలని అన్నారు.
నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ మాట్లాడుతూ గడువు ముగిసిన తరువాత వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరిస్తే జరిమానాలు తోపాటు అవసరమైతే కేసులు నమోదు చేస్తామని అన్నారు.
పొదిలి పట్టణంలో రెండోవ రోజు కర్ఫ్యూ అమలును పొదిలి యస్ఐ సురేష్ పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, నగర పంచాయితీ సిబ్బంది, మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు