పట్టణంలో కఠిన లాక్ డౌన్ ఆంక్షలు… ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ సురేష్

పట్టణంలో 28రోజుల పాటు కఠిన ఆంక్షలు ఉంటాయని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ సురేష్ తెలిపారు.

వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు విడుదలైన కోవిడ్ రిపోర్టుల్లో పొదిలి పట్టణంలో నమోదైన కోవిడ్ కేసుల దృష్ట్యా పట్టణంలో కఠిన ఆంక్షలు అమలు చేయడం జరుగుతుందని….

దుకాణదారులు షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడకపోతే దుకాణ దారులపై చర్యలు చేపడతామని….. మాస్కు ధరించని కొనుగోలు దారులకు అమ్మకాలు జరుపరాదని…… అలాగే ప్రతి దుకాణం వద్ద సానిటైజర్ అందుబాటులో ఉంచి కొనుగోలు దారులను శానిటైజ్ చేసుకునేలా చూడాలని…. సమయం దాటిన తర్వాత దుకాణాలు తెరిచి ఉన్నా కూడా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని వ్యాపారులను హెచ్చరించారు.

కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయం కాబట్టి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు….. అత్యవసరమై బయటికి వచ్చినా మాస్కు ధరించి, తరచుగా శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తేనే కరోనా మహమ్మారిని అరికట్టగలని సూచించారు.