ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తే సహించేది లేదు
విద్య ర్యాంకులతో , ఫీజుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తే సహించేది లేదంటూ T.N.S.F. ఆధ్వర్యంలో కళాశాల బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక వీరిశెట్టి కళాశాల విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టి విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటూరి. వెంకటేశ్వరరావు తెలుగు దేశం పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జిల్లాలోని ప్రతి కార్పొరేట్ ప్రవేట్ కాలేజీలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తామని,ప్రవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని యెడల కళాశాల యజమానులకు శిక్ష తప్పదన్నారు .జిల్లా నాయకులు మూల్లా . జిందాబాష మాట్లాడుతూ ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తే సహించేది లేదని ,అట్టి పరిస్థితుల్లో T.N.S.F. విద్యార్థుల పక్షాన నిలుస్తుందని, ప్రభుత్వానికి విద్యార్థుల మధ్య వారధిగా వ్యవహరిస్తుందని అన్నారు. సంగం రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి కళాశాలలో కాంప్లేంట్ బాక్స్ లు ఏర్పాటు చేస్తామని, ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేయవలసినదిగా విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు కరిముల్లా, నిరంజన్,సాయి, రమేష్, మన్సూర్, ఫిలీప్ రాజు,తదితరులు పాల్గొన్నారు.