హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని షామ్స్ ఉల్ ఉలూమ్ బిఇడి కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హల్ టికెట్ల ఇవ్వకపోవడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు.

మొత్తం షామ్స్ ఉల్ ఉలూమ్ కళాశాల నందు 109 మందికి విద్యార్థులకు గాను 14 మందికి మాత్రమే హల్ టికెట్ల ఇవ్వగా మీగత 95 మందికి విద్యార్థులకు హల్ టికెట్ల ఇవ్వకపోవడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

విద్యార్థులు మొత్తం బీహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ , ఒరిస్సా, రాష్ట్రాలకు చెందినవారు .

విద్యార్థులు మీడియా మాట్లాడుతూ సెప్టెంబర్ 14 తేదీ నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షల కోసం తొలిత అందరి హల్ టికెట్ల ఇవ్వగా ఆరోజు నుంచి జరగవలసిన పరీక్షలు సెప్టెంబర్ 17కు వాయిదా పడటం తో మరలా హల్ టికెట్లను కళాశాల యాజమాన్యం కేవలం 14 మంది విద్యార్థులకు హల్ టికెట్ల ఇచ్చి ఇతర విద్యార్థులకు ఇవ్వలేదని గత రెండు రోజులుగా కళాశాల తెరిచలేదని యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసారని వారు వారి బాధ వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు హల్ టికెట్లను ఇప్పించవలసిందిగా కోరుతున్నారు