ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొదిలి సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డన్ గా పనిచేస్తున్న కట్టెబోయిన సుబ్బయ్య దరిశి నుండి పొదిలి వస్తుండగా అదుపుతప్పి మల్లవరం పవర్ ఆఫీసు వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోగా మోటారుసైకిల్ సోడా బండిని ఢీకొనింది. రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడిన సుబ్బయ్యను స్ధానికులు 108కు సమాచారం అందించి పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.