పొదిలిటైమ్స్….. ఉత్తమ న్యాయవాది అవార్డు గ్రహీత గుద్దేటి సుబ్బారావు
ఉత్తమ న్యాయవాది అవార్డు గ్రహీతగా గుద్దేటి సుబ్బారావును ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో గత 25 సంవత్సరాల నుండి ప్రజల పక్షాన వాదన ప్రతివాదనలు చేసి తన ప్రతిభతో సామన్యుడికి న్యాయం చేస్తూ మంచి పనితీరు చూపించడంతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించే వారిని ప్రోత్సహిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ప్రజల మన్ననలు చొరగొన్నారు. ఆయన సేవలను గుర్తించి పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ న్యాయవాది అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.