కేజ్రీవాల్ పై పోటీకి బిజెపి అభ్యర్థిగా యువనేత సునీల్ యాదవ్

ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కొత్త ఢిల్లీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సునీల్ యాదవ్ ను భారతీయ జనతాపార్టీ తన అభ్యర్థిగా ఖరరు చేసింది.

వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు తీవ్రంగా కసరత్తు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ…… చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా గత నాలుగు సంవత్సరాలుగా పెద్దఎత్తున యువతను సమీకరించి భారీ ఉద్యమాలు నిర్వహించడంతో పాటుగా గత సార్వత్రిక, పార్లమెంటు ఎన్నికలలో ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలను బిజెపి కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన యువనేత సునీల్ యాదవ్ వైపు బిజెపి అధిష్టానం మోగ్గుచుపింది.

దానితో పాటుగా కొత్త ఢిల్లీ శాసనసభ నియోజకవర్గంలో బలంగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘటన శ్రేణులతో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 50వేలకుపైగా ఉండడం కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేసిన బిజెపి తన పార్టీ అభ్యర్థిగా సునీల్ యాదవ్ ను ఖరారు చేసింది….. పార్టీ అధిష్టాన నిర్ణయంలో భాగంగా మంగళవారం నాడు సునీల్ యాదవ్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

2013లో అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పై పోటీచేసిన అమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం సాధించిన విధంగానే…. ప్రస్తుతం సునీల్ యాదవ్ కూడా విజయం సాధించే అవకాశం ఉందని బిజెపి శ్రేణులు, వర్గాలు భావిస్తున్నాయి.