అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన స్థానిక శివాలయం వద్ద జరిగింది.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని స్థానిక శివాలయం వద్ద తెల్లవారుజాము గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలను సేకరించే క్రమంలో మృతుడు హనుమంతునిపాడు మండలం ముక్కువారిపల్లి గ్రామానికి చెందిన చిన్నమాల కొండయ్య (73)గా గుర్తించారు.
తలకు తీవ్ర గాయమై అనుమానాస్పద స్థితిలో మృతదేహం ఉండడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం వైద్యశాలకు తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.