అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారంనాడు తెల్లవారుజామున చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలంలోని ఉన్నగురవాయపాలెం గ్రామానికి చెందిన జంగాల రామయ్య(44) స్థానిక దర్శి రోడ్డులోని ఎస్ఎస్ఆర్ అపార్ట్మెంట్ సమీపంలో తెల్లవారుజామున 2:30గంటల సమయంలో ఆటోలో నిద్రిస్తూ మృతిచెందినట్లు గుర్తించి….. బంధువులకు సమాచారం అందించగా మృతుని భార్య అరుణారాణి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు తరలించినట్లు పొదిలి ఎస్ఐ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.