స్వామి వివేకానంద రథయాత్రకు ఘన స్వాగతం
స్వామి వివేకానంద స్వామి చికాగో ప్రసంగాల 125వ జయంత్యుత్సవాలు సందర్భంగా రామకృష్ణ మిషన్ ఆద్వర్యంలో తలపెట్టిన స్వామి వివేకానంద రథయాత్రకు పొదిలి పట్టణంలో ఘన స్వాగతం పలికారు.సోమవారం నాడు స్ధానిక చిన్న బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం పెద్ద బస్టాండ్ వద్ద జరిగిన సభలో స్వామి స్వసంవేద్యానంద మాట్లాడుతూ కడప రామకృష్ణ మిషన్ నుండి విశాఖపట్నం రామకృష్ణ మిషన్ వరకు స్వామి వివేకానంద రథయాత్ర సాగతుందాని రాయలసీమ నెల్లూరు జిల్లాలు ముగించుకొని ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిందాని భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు. యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచిన వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తురి చెంచు సుబ్బారావు వెన్నెల శ్రీనివాస్ కొండ నాగరాజు రావురి సత్యనారాయణ మునగాల రమణ కిషోర్ వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు