“స్పందన” కార్యక్రమానికి అర్జీల వెల్లువ …..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి ప్రజలలో విశేష స్పందన లభించింది.
వివరాల్లోకి వెళితే స్పందన కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్ నందు ప్రజలు రేషన్ కార్డులు, పెన్షన్, గృహాలు, ఇంటి నివేశన స్థలాలు తదితరాలపై పలు రకాల అర్జీలను తహశీల్దార్ కు సమర్పించి రసీదులను పొందారు.
ఈ సందర్భంగా పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ హమీద్ మాట్లాడుతూ మొత్తం 152అర్జీలు వచ్చాయని స్థలాల కోసం- 7 పెన్షన్ల కోసం- 65 గృహాల కోసం-42, రేషన్ కార్డుల కోసం -38 వచ్చాయని….. అర్జీలను ఆన్లైన్ నందు పరిశీలించి అర్హులైన వారికి సత్వర పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.