శివాలయం దేవస్థానం పాలకవర్గం ప్రమాణస్వీకారం

శనివారం మధ్యాహ్నం 2గంటల సమావేశంలో స్వామి వారి సన్నిధిలో శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశర స్వామి దేవస్థానం పాలకవర్గం సభ్యులుగా యక్కలి శేషగిరిరావు, కొలగట్ల అంజి రెడ్డి,పాలకూరి నాగేశ్వరరావు,మునగాల వెంకట లక్ష్మీ సుజాత, పావులూరి నాగమణి, గంజి సుబ్బారావు, అర్చకులు సుబ్బా నారసయ్య ల చేత దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు

అనంతరం సభ్యుల నుంచి ఛైర్మన్ గా యక్కలి శేషగిరిరావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

కార్యనిర్వహణాధికారి తొమ్మిది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు