పొదిలి లో విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు 8వ తరగతి విద్యార్థులకు మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి ట్యూబ్‌లను పంపిణీ చేశారు.
పాఠశాల లో మొత్తం 193 మంది విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో హాబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్, పాఠశాల అభివృద్ధి కమిటీ మాజీ ఛైర్మన్ కల్లం వెంకట సుబ్బారెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గొలమారి చెన్నారెడ్డి, వినోద్, మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు