తాడివారిపల్లి అటవీప్రాంతంలో మరో మృతదేహం లభ్యం….

తర్లుపాడు మండలం తాడివారిపల్లి అటవీప్రాంతాన్ని జల్లెడపట్టిన పోలీసులు గల్లంతైన ఇద్దరిలో కట్టా శివకుమార్ మృతదేహం గురువారంనాడు కనుగొన్న విషయం తెలిసిందే….

కాగా గురువారంనాడు చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేసిన పోలీసులు శుక్రవారంనాడు తెల్లవారుజాము నుండే మరలా గాలింపు చర్యలు ముమ్మరం చేసి శుక్రవారంనాడు మధ్యాహ్నానికి గుంటూరుజిల్లా కొల్లిపరకు చెందిన హనుమంతరావు మృతదేహాన్ని కూడా కనుగొన్నారు.