లే ఔట్ ఆక్రమణ నోటీసులు జారీ చేసినా తహశీల్దారు
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని రాజుపాలెం గ్రామం నందు పొదిలి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 1064 నందు ప్రభుత్వం నిధులతోనే తయారు చేసిన లే ఔట్ ను ఆక్రమణకు గురికావడం పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న వారు మాట్లాడుతూ తమ గ్రామంకు చెందిన గ్రామకంఠం భూమి తమ గ్రామానికి చెందిన వారికి హక్కు ఉంటుందని తమ గ్రామంలో నివేశన స్థలాలు లేవని కావున తాము ఇంటి నిర్మాణం మొదలు పెట్టమని తమకు ఆకారణంగా ప్రభుత్వం అధికారులు తమ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.