ఆంధ్రప్రదేశ్ విలేకరుల యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించిన తహశీల్దార్ ప్రభాకరరావు
ఆంధ్రప్రదేశ్ విలేకరుల యూనియన్ కార్యాలయాన్ని పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే నూతనంగా ఏర్పాటు అయిన ఆంధ్రప్రదేశ్ విలేకరుల యూనియన్ నూతన కార్యాలయాన్ని శనివారంనాడు మండల రెవెన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ శ్రీరామ్, వైకాపా నాయకులు జి శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, తెదేపా నాయకులు సయ్యద్ ఇమాంసా మరియు ఆంధ్రప్రదేశ్ విలేకరుల యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.