సామాన్యులకు అందుబాటులోమండల ప్రజానీక హృదయాలను దోచుకున్న తహశీల్దార్ ప్రభాకరరావు
సామాన్యులకు అందుబాటులో ఉంటూ మండల ప్రజల హృదయాన్ని దోచుకున్న పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు నేటితో పొదిలి మండల రెవిన్యూ తహశీల్దారుగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా పొదిలిటైమ్స్ ప్రత్యేక కథనం……
2019వ సంవత్సరం జూలై 11వ తేదిన పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రభుత్వం పథకాల అమలులో ముందుంటూ మండల ప్రజల హృదయాలను చొరగొన్న జీవిగుంట ప్రభాకరరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరవాత ప్రజాసమస్యల పరిష్కార వేదికగా స్పందన పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమస్యలు పరిష్కారంలో జిల్లాలో ప్రధమంగా ఉండడమే కాకుండా…… స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా భూ సమస్యల పరిష్కరం కొరకు రెండు పర్యాయాలు ప్రత్యేక స్పందన కార్యక్రమన్ని నిర్వహించి మండల రెవెన్యూ శాఖ పరిధిలో పరిష్కరించే వీలున్న అన్ని భూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారు.
అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాల వ్యవస్థకు సంబంధించిన భవనాల కోసం స్థల సేకరణ ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోగా సమకుర్చడంతో ఉన్నతాధికారులు మన్ననలు పొందారు.
అలాగే ప్రభుత్వం పేదలకు ఇంటి నివేశన స్దలాల మంజూరు విషయంలో పొదిలి మండలం నందు సుమారు 120ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి 3500మంది పేదలకు పట్టాలు పంపిణీ
చేసే విధంగా సర్వం సిద్దం చేయడమే కాకుండా……. రాష్ట్ర మొత్తం యూనిట్ గా తీసుకుంటే ఒక మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయం పరిధిలో ప్రైవేటు భూమి కొనుగోలు చేయకుండా సుమారు 120ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి అందులో పేదలకు పట్టాలు పంపిణీకి సిద్ధం చేయడంతో పాటుగా మరో 150ఎకరాల భూమిని రిజ్వర్ గా చూపించటంలో ఒక్క ప్రభాకరరావు తప్పితే ఎవరు లేరని చెప్పవచ్చు…… మాకు తెలిసిన సమాచారం మేరకు స్వాంతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ తహశీల్దార్ గా ఎంపిక అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు సమాచారం.
కరోనా కష్ట కాలంలో ఏర్పాటు చేసిన జాతీయ లాక్ డౌన్ కార్యక్రమాన్ని ఇతర అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాకుండా నిర్వహించిన ఆయన……. కోవిడ్ నియంత్రణకై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ యాక్షన్ ప్లానును అమలుచేస్తూ కోవిడ్ కేసుల వ్యాప్తి నివారణలో అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలను పొందడంలో ఎంతో కృషిచేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి చేసే ప్రతి పనిలో ప్రజా మన్ననలు పొందుతూ ప్రజాసమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి……. అలాగే సకల సౌకర్యాలతో ప్రస్తుత నూతన తహశీల్దార్ భవనం ఆయన హయాంలో ప్రారంభం కావడం విశేషం.
మొత్తానికి ప్రజలతో హాట్స్ ఆఫ్ అనిపించుకుంటున్న పొదిలి మండల తహశీల్దార్ జీవిగుంట ప్రభాకరరావుకు శుభాకాంక్షలు.