వివిధ దృవీకరణ పత్రాలు పంపిణీ చేసిన తహశీల్దారు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జగనన్న సురక్ష కార్యక్రమం సందర్భంగా వివిధ రకాల దృవీకరణ పత్రాలను మండల రెవెన్యూ తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు.
బుధవారం నాడు స్థానిక పొదిలి మండలం కొండాయిపాలెం గ్రామ సచివాలయం నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ అద్యక్షతన తో జరిగిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా హాజరైన మండల రెవెన్యూ తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యధిక పౌర సేవలు అందించిన సచివాలయం అదే విధంగా మార్కాపురం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో పౌర సేవలు అందించినందుకు సిబ్బందిని అభినందించారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో 80 వేల రూపాయలు విలువైన పౌర సేవలు ఉచితంగా అందించినట్లు మండల పరిషత్ అభివృద్ధి శ్రీకృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ రాజశేఖర్, సర్పంచ్ సన్నెబోయిన మాధవి, ఆర్ఐ కిలారి సుబ్బారావు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు