సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన తహశీల్దారు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి పట్టణంలోని సచివాలయం నాలుగును మండల రెవెన్యూ తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

శనివారం స్థానిక విశ్వనాథపురం లోని సచివాలయం నాలుగును సందర్శించిన తహశీల్దారు సిబ్బంది హాజరు రిజిస్ట్రార్ పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి సచివాలయం సిబ్బంది గురించి ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల స్పందించి చర్యలు తీసుకోవాలని తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిలారి సుబ్బారావు, విఆర్ఓ మురళి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు