ఘానంగా టైలర్స్ డే
పొదిలి పట్టణంలో బుధవారం నాడు టైలర్స్ డే వేడుకలను ఘానంగా నిర్వహించారు తొలుత స్ధానిక పొదిలి టైలర్స్ అసోసియేషన్ కార్యలయం నందు టైలర్స్ జెండా ను ఆవిష్కరించి నినాదాలు చేస్తు కార్యలయం నుండి పెద్ద బస్టాండ్ చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్యలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైలర్స్ బోర్డు ను తిరిగి పునర్ధించాలని అర్హత కలిగిన టైలర్స్ ఇంటి పట్టాలు మాంజురు చేయలని టైలర్స్ కు 5 శాతం వడ్డీ తో 50శాతం రాయితీ తో రుణలు మంజూరు చేయలని టైలర్స్ ఉచిత భీమా సౌకర్యం కల్పించాలని టైలర్స్ పిల్లలు కు ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలని మొదలగు తీర్మానలు చేసారు ఈ కార్యక్రమంలో పొదిలి టైలర్స్ అసోసియేషన్ నాయకులు డి కోటేశ్వరరావు శ్రీనువాసులు షేక్ ఖాసింపీరా షేక్ మజ్ను ముల్లా రసూల్ షేక్ బికారి షేక్ అల్లాభక్షు షేక్ ఖాలిల్ షేక్ మస్ధాన్ తదితరులు పాల్గొన్నారు