కెనరా బ్యాంక్ సేవాలను సద్వినియోగం చేసుకొండి
కెనరా బ్యాంక్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు మేనేజర్ జి అరుణ్ మణికుమార్ అన్నారు.
బుధవారంనాడు స్థానిక పొదిలి బ్రాంచ్ నందు జరిగిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు బాగంగా ఆయన మాట్లాడుతూ జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు నాబార్డు వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు డిపాజిట్లు చేసుకోవాలని సూచించారు.
అదే విధంగా బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించాలని అలాగే ప్రధానమంత్రి జన్ధన్ భీమా యోజన పథకాలు,నగదు రహిత లావాదేవీలునిర్వహించాలని, ప్రతి ఒక్కరు కూడా రూపే కార్డును వినియోగించాలన్నారు. బ్యాంకులో హౌసింగ్, ట్రాక్టర్ల లోన్లు బంగారు పైన రుణాలు యస్ హెచ్ జి లోన్స్ క్రాప్ లోనూ ప్రతి ఒక్కరు కూడా పొంది సకాలంలో చెల్లించాలని బ్యాంకులో గుర్తింపు పొందాలని మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అలాగే అటల్ పెన్షన్ యోజన ప్రతి మనిషి కూడా ఇన్సూరెన్స్ ఉండాలని అవగాహన కల్పించారు
కేఎస్ రూరల్ మీడియా కళాసంస్థ మురళి శశి బ్రహ్మయ్య లక్ష్మయ్య కళాజాత బృందం పాటల ద్వారా మాటల ద్వారా మ్యాజిక్ రూపంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో మేనేజర్ అరుణ్ మణికుమార్, అధికారులు అరుణ్ కుమార్, సిహెచ్ పెద్ద బాబు, ఖాతాదారులు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.