తలమల్ల గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో సెమిక్రిస్మస్ వేడుకలు
జనసేన పార్టీ ఆధ్వర్యంలో తలమల్ల గ్రామంలో సెమీక్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలం లోనితలమల్ల గ్రామంలో సోమవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకును కోసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన మండల నాయకులు ముల్లా బాజీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యో విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ కాలేషా, నవిన్, సన్ని, షేక్ ఇంతియాజ్, షేక్ హల్చల్ జహీర్, షేక్ ఖాజా యస్పీ జి మహేష్ ఎం ఏసు జి రాజశేఖర్ జి నాగరాజు జి చారి కిషోర్ షేక్ నఫిజ్ తదితరులు పాల్గొన్నారు.