తెదేపా నాయకులు, కార్యకర్తలలో నూతనోత్సాహం

పార్టీ విస్తృత సమావేశంలో భాగంగా శనివారంనాడు ఒంగోలు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెల్ఫీలకు అవకాశం కల్పించారు. వివరాల్లోకి వెళితే శనివారం నాడు ఒంగోలుకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు తమ్ముళ్లు స్వాగతం ఘన స్వాగతం పలికారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం 4సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి తదితర కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఆనంతరం జిల్లాలోని పలువురు నాయకులు, కార్యకర్తలకు సెల్ఫీ దిగే అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులకే కాకుండా పలువురు కార్యకర్తలకు కూడా సెల్ఫీ అవకాశం లభించడం పట్ల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం ద్వారా నెలకొన్న నూతనోత్సాహంతో పార్టీ కోసం ఇంకొంత అంకిత భావంతో పనిచేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల భావన.