తెలుగు దేశం పార్టీ ని బంగాళఖాతము లో కలపండి : వైసీపీ అధినేత జగన్

45 వేలు పైగా  పాల్గొని  ప్రజలు

ప్రపంచ అవినీతి సామ్రాట్ చంద్రబాబు ను తెలుగు దేశం పార్టీ ని బంగాళఖాతంలో కలపాలని పొదిలి చిన్న బస్టాండ్ జరిగిన బహిరంగ సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు టీవీల్లో, పత్రికల్లో కనిపిస్తున్నారు. చంద్రబాబు ఊసరవెల్లి కన్నా స్పీడ్ మాటలు మారుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏ పెద్ద ఏం చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో.. నాలుగు సంవత్సరాలుగా మీరు చూశారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలు, అన్యాయమైన పాలన చూశారు.అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు తొలగిస్తామని చంద్రబాబు చెప్పారు. మరి, ఈనాడు గ్రామాల్లో మంచినీళ్లు దొరుకుతాయా లేదో తెలీదు గానీ, మద్యం దొరకని గ్రామం ఉందా?ఫోన్ కొడితే మినరల్ వాటర్ తీసుకురారు. అదే ఫోన్ కొడితే మద్యం ఇంటికి డెలివరీ చేస్తారు. – దేశంలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి.  కర్నాటక, తమిళనాడు, తెలంగాణలో మనకన్నా రూ.7లు తక్కువకే పెట్రోల్, డీజిల్ లభిస్తోంది. ఎన్నికలప్పుడు కరెంటు బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న బాబు అధికారంలోకి వచ్చాక భారీగా పెంచారు. బాబు వచ్చాక రూ.1000లకు పైగా కరెంటు బిల్లులు వస్తున్నాయ్.నాలుగు సంవత్సరాల బాబు పాలన ఇది.
– గతంలో రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, కారం, ఉప్పు, పసుపు, చింతపండు, కిరోసిన్ అన్నీ ప్యాక్ చేసి రూ.185కే చేతుల్లో పెట్టేవారు. ఇప్పుడు బాబు ముఖ్యమంత్రి అయ్యాక రేషన్ షాపుల్లో బియ్యం తప్పు ఇంకేమీ దొరకటం లేదు. ఆ బియ్యం కూడా ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికి వేలిముద్రలు పడటం లేదని కటింగ్ చేస్తున్నారు