అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు లక్షా రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తెదేపా డిమాండ్

మార్కాపురం రెవెన్యూ డివిజన్ నందు గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు 50 వేల హెక్టార్లు పంట నష్టం జరిగిందని ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఆదివారం నాడు మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని రూరల్ మండలం తిప్పయిపాలెం లో వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంటలను శాసనసభ్యులు గొట్టిపాటి రవి కుమార్ , డోలా వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గాల ఇన్చార్జిలు కందుల నారాయణరెడ్డి ,ఎం అశోక్ రెడ్డి, దామచర్ల సత్య తో కూడిన ప్రతినిధి బృందం పరిశీలించింది.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం అందించాలని మార్కాపురం డివిజన్ పరిధిలో సుమారు 50 వేల హెక్టార్లలో అకాల వర్షాలకు పంట నష్టపోయారని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రేపటి నుంచి క్షేత్ర స్థాయిలో కి ప్రభుత్వ బృందం పర్యటించి వారం రోజుల్లో నష్టపరిహారం అందించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో లో తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు