తెదేపా నాయకులతో మంతనాలు జరిపిన ఇమ్మడి
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో 2వరోజు 4,5,6, వార్డుల్లో పర్యటించిన మార్కాపురం జనసేన పార్టీ అభ్యర్థి ఇమ్మడి కాశీనాధ్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి గంగవరపు దీప, మాజీ ఉపసర్పంచ్ షేక్ జిలాని లను కలిసి మద్దతు కోరారు.
అయితే వారిరువురూ ఇమ్మడికి తమ మద్దతు ఇవ్వడంలో సానుకూలంగా స్పందించారని సమాచారం……
మాజీ సర్పంచ్ దీప మద్దతుపై ఆయనను అడగగా ఒకే పార్టీలో పనిచేసిన సాన్నిహిత్యంతో తన మనస్తత్వం తెలిసిన చాలామంది నాయకులు తనకు మద్దతుగా ముందుకు వస్తున్నారని….. ఎవరిని బలవంతంగా నాకోసం పనిచేయమని కోరడం జరగలేదని అన్నారు.