స్మశాన కబ్జాదారులపై కేసు నమోదు చేయకపోతే మహాధర్నా : కందుల
స్మశాన కబ్జాదారులపై కేసు నమోదు చేయకపోతే మహాధర్నా చేస్తామని మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు.
వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు స్థానిక సామిల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పవిత్ర అయ్యప్ప మాల ధరించిన వైసీపీ నాయకులు దౌర్జన్యంగా స్మశానాన్ని ధ్వంసం చేసి ఆక్రమించడం ద్వారా అయ్యప్పమాలను అవమాన పరచారని…… అదేవిధంగా అయ్యప్ప స్వామి మీద అంత ప్రేమే ఉంటే మీ ఆస్తులలో నిర్మాణం చేసుకోవచ్చు మీకే కిర్తీ వస్తుందని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.
స్మశాన ఆక్రమణలను ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకుని వెళతామని అక్కడ కూడా న్యాయం జరగపోతే రోడ్డు ఎక్కవలసి వస్తుందని హెచ్చరించారు.
పొదిలి పట్టణంలోని పెద్ద చెఱువుకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన భూములను ఆక్రమించి వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తున్నారని…. వారితో లాలూచి పడ్డారా లేక మరి ఏదైనా కారణమా అని ప్రశ్నించారు.
పొదిలి మండలంలో జరిగిన ఆక్రమణలు మరియు స్మశాన ధ్వంసం అన్యాక్రాంతమైన భూములపై విజిలెన్స్ తో పాటు అన్ని విభాగాలకు ఫిర్యాదు చేస్తామని…. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని త్వరలోనే పెద్దఎత్తున మహా ధర్నా చేస్తామని కందుల నారాయణ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు,