తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా
తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ మరియు ధర్నా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నాడు స్థానిక పెద్ద బస్టాండ్ లోని యన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అక్కడి నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేసి అనంతరం మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్ , మండల తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఆవులూరి యలమంద, షేక్ రసూల్, సమంతపూడి నాగేశ్వరరావు, సయ్యద్ ఇమాంసా, మీగడ ఓబుల్ రెడ్డి, భూమా సుబ్బాయ్య, నరసింహారావు, టి యన్ యస్ యఫ్ ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, తెలుగు యువత నాయకులు కాటూరి హరి ప్రసాద్, ముని శ్రీనివాస్,ముల్లా ఖయ్యాం,ముక్కర కిరణ్, షేక్ సంధ్యాని, సురేష్, తెలుగు మహిళ నాయకురాలు షేక్ షానవాజ్ తదితరులు పాల్గొన్నారు