బాణసంచా దుకాణాలను పరిశీలించిన తహశీల్దారు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పట్టణంలోని బాణసంచా దుకాణాలను పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు భాగ్యలక్ష్మి పరిశీలించారు.

విజయవాడ నందు బాణసంచా ప్రమాదం సంఘటన తో అప్రమత్తమైన అధికారులు ఆదివారం నాడు పట్టణంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను తహశీల్దారు భాగ్యలక్ష్మి సందర్శించి వ్యాపారస్తులు తీసుకున్నా ముందు జాగ్రత్త చర్యలు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బారావు, సర్వేయర్ బ్రహ్మం గ్రామ రెవెన్యూ అధికారులు మురళి, నారాయణ, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు