షబ్బీర్ కు సత్కరించిన తెలుగు తమ్ముళ్లు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి గా ఎంపికైన షేక్ షబ్బీర్ ను పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ తాను 1996 సంవత్సరం యస్వీకెపి డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో తెలుగు విద్యార్థి తరుఫున పోటీ చేసానని నాటి నుంచి నేటి వరకు తెలుగు దేశం పార్టీ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా నాకు జిల్లా న్యాయ విభాగం అధికార ప్రతినిధి గా ఎంపికకు కృషి చేసిన కందుల నారాయణరెడ్డి కి మరియు మండల పార్టీ నాయకులు కు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ రసూల్ ,తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, న్యాయ విభాగం జిల్లా అధికార ప్రతినిధి మైనారిటీ విభాగం మండల అధ్యక్షులు షేక్ షబ్బీర్ భాషా,షేక్ మస్తాన్ వలి, విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ భాష, మైనారిటీ నాయకులు షేక్ యాసిన్, షేక్ మౌలాలి, తెలుగు దేశం పార్టీ నాయకులు ఆవూలూరి నాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు