దుల్హన్ పథకం రద్దు పట్ల విరుచుకుపడ్డ తెలుగు తమ్ముళ్లు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనారిటీ యువతులకు వివాహం సందర్భంగా ఆర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపివేసినట్టు హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలపటం పట్ల తెలుగు దేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులు అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక పొదిలి మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ రసూల్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి రూ.50 వేలు అందజేసి కార్యక్రమానికి నిధులు లేవని అందుకే రద్దు చేసామని కోర్టు కు తెలపటం ద్వారా మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప మైనారిటీ సంక్షేమ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మాజీ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దుల్హన్ పథకం కింద 50 వేల రూపాయలు నుంచి లక్ష రూపాయలు కు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి పేరు తో రద్దు చేసినట్లు కోర్టు కు తెలపటం ద్వారా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, న్యాయ విభాగం జిల్లా అధికార ప్రతినిధి మైనారిటీ విభాగం మండల అధ్యక్షులు షేక్ షబ్బీర్ భాషా,షేక్ మస్తాన్ వలి, విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ భాష, మైనారిటీ నాయకులు షేక్ యాసిన్, షేక్ మౌలాలి, తెలుగు దేశం పార్టీ నాయకులు ఆవూలూరి నాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు