తెలుగు యువత ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు
నారా లోకేశ్ జన్మదిన వేడుకలు తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు జ్యోతి మల్లి, జి నరసింహారావు, వెంకట్రావు, వరికూటి వెంకటేశ్వర్లు, షేక్ గౌస్ బాషా, తెలుగు యువత నాయకులు ముల్లా జిందాబాషా, ముల్లా జిందాబాషా (హేచ్ వై డి), ముల్లా మున్సూర్, షేక్ రియాజ్, తులసీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.