ఫైలేరియా నివారణకై విద్యార్థులకు పరీక్షలు

పొదిలి పట్టణంలోని ఆల్ఫా విద్యా సంస్థ నందు 2వ తరగతి లోపు విద్యార్థులకు
ఫైలేరియా (బోద) నివారణకై గురువారం నాడు పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య అధికారిణి షేక్ షాహీదా మాట్లాడుతూ పొదిలి,కొనకనమీట్ల మండలాల్లో తమ టీం ఏడు సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించి వారి పాజిటివ్ ఉంటే వారి వెంటనే చికిత్స అందించటం జరుగుతుందని ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ షాహిదా ,‌ప్రత్యక బృందం అధికారులు పి బ్రహ్మానందం, పి శ్రీనివాసరావు, టి ఏడుకొండలు , కె విజయ, పి ఆనంద్, జ్యోతి ,ఆశ కార్యకర్త రమాదేవి తదితరులు పాల్గొన్నారు