రిజర్వాయర్ మార్పు పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదములు
పొదిలి పెద్ద చెరువును రిజర్వాయర్ గా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చెయ్యటం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
స్థానిక సాయి కళ్యాణ మంటపం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీనియర్ సిటిజన్ మాకినేని రమణయ్య , వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి,కొత్తపులి బ్రహ్మ రెడ్డి, ఆర్యవైశ్య సంఘ నాయకులు గునుపూడి చెంచు సుబ్బారావు, బిజెపి నాయకులు చంద్రశేఖర్ లు ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు