ఆ సచివాలయం పనిచేసేది రోజుకు రెండు గంటలేనా!
గ్రామ సచివాలయం వ్యవస్థ ప్రారంభమైన నాటి నుండి తొలుత కొద్ది నెలలు మాత్రమే సక్రమంగా హాజరైన ఉద్యోగులు తరవాత వారికి ఇష్టమైన తీరుగా రావడం వెళ్లడం పరిపాటు అయింది.
అదే విధంగా నేడు మంగళవారంనాడు మద్యహ్నం 2గంటల సమయంలో స్థానికులు కొంత మంది సచివాలయ సేవలు నిమిత్తం గ్రామ సచివాలయానికి వెళ్లగా అక్కడ తాళం వేసి ఉండడంతో ఫోటోలు తీసి మండల జిల్లా అధికారులతో పాటు పొదిలిటైమ్స్ కు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.
ఈ విషయంపై స్థానికులతో పొదిలిటైమ్స్ మాట్లడగా మా సచివాలయంలో గత నాలుగు నెలల నుండి పూర్తి సమయం కార్యాలయంలో సిబ్బంది ఉండడం లేదని ఉదయం రెండు గంటలు మాత్రమే సిబ్బంది మొత్తం ఉంటారని తరవాత ఒక్కరు లేక ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉంటారని అధికారులకు ఫిర్యాదు చేస్తే సంక్షేమ పథకాలు అందవనే భయంతో కొంతకాలం మౌనంగా ఉన్నామనే నెపంతో స్థానిక గ్రామ సచివాలయం ఉద్యోగుల ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని గ్రామ సచివాలయం ఉద్యోగులు ప్రభుత్వ వేళల్లో ఖచ్చితంగా కార్యాలయంలో ఉంటున్నారని స్ధానికులకు సేవలను అదించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.