హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది…. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జిఓను కొట్టివేస్తూ బుధవారంనాడు తీర్పును వెలువరించింది.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీఓ నబర్ 81, 85ను సవాల్ చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా……

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం గతంలో ఈ తీర్పును రిజర్వ్ చేసింది…. అయితే తాజాగా బుధవారంనాడు విచారణ చేపట్టగా పిటిషనర్ తన వాదనను వినిపిస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేయడం వలన పిల్లలు మాతృభాషలో చదువుకునే అవకాశం కోల్పోతారని….. అలాగే ఇంగిషును తప్పనిసరి చేయడం వలన ఇప్పటి వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు సబ్జెక్టులు మిగిలిపోతాయని తద్వారా వారి భవిష్యత్తు పాడైపోయే అవకాశం ఉందని వాదించగా…….

ప్రభుత్వం తరుపు న్యాయవాది నేటి పోటీ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లల భవిష్యత్తు కోసమే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేయాల్సి వస్తుందని వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిల్లలు ఏ మీడియంలో చదవాలి అనేది పిల్లల అభీష్టం మేరకు తల్లిదండ్రులు నిర్ణయిస్తారని అది వారి స్వేచ్ఛగా పరిగణిస్తు….. ఇంగ్లీషు మీడియంలోనే చదవాలి అంటూ ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని స్పష్టం చేసింది…. అలాగే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 81, 85ను న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.