బెల్ట్ పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
బెల్ట్ పోటీల విజేతలకు మరిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకటరెడ్డి బహుమతులను ప్రధానం చేశారు.
ఆదివారం నాడు స్థానిక విశ్వనాథపురం లోని బాలుర ఉన్నత పాఠశాల నందు కరాటే మాస్టర్ కఠారి రాజు ఆధ్వర్యంలో జరిగిన బెల్ట్ పోటీలు నిర్వహించారు.
అనంతరం 14 మంది విజేతలకు మరిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకటరెడ్డి, హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్, విశ్రాంత మండల విద్యాశాఖాధికారి సుబ్బారావు, ఉపాధ్యాయులు బివి మోహన్ రెడ్డి మరియు కరాటే విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు