ప్లాన్ ఆమోదం గురించి అపోహలు వద్దు కమీషనర్

తొలి ప్లాన్ ఆమోదం పత్రాన్ని అందజేసిన కమీషనర్

ప్లాన్ ఆమోదం గురించి అపోహలు వద్దు

ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయితీ నందు తొలి ప్లాన్ ఆమోదం పత్రాన్ని నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ అందజేశారు.

ఈ సందర్భంగా కమీషనర్ భవాని ప్రసాద్ మాట్లాడుతూ పొదిలి నగరపంచాయితీ నందు ఇంటి నిర్మాణములు చేపట్టుచున్న వారందరు ఇక నుండి “ఆన్ లైన్ ద్వారా. అనుమతులు పొందవచ్చును. అంతే కాకుండా మీరు కట్టబోయే నిర్మాణములకు సంబంధించి సందేహాలు ఉన్నదో పొదిలి నగర పంచాయితీ పరిధిలోని సచివాలయముల నుండి లేదా నగర పంచాయితీ కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ సెక్షన్ నందు గాని తగు వివరణలు తెలుసుకొనవచ్చును. మీరు కొనబోయే స్థలాలు అప్రూవల్ లే అవుట్ గా కలిగి ఉన్నదా! లేదా అని పూర్తి విషయములు తెలుసుకొని స్థలాలు కొనుగోలు చేయవలసినదిగా  కోరారు

అదే విధముగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మేరకు రోడ్డు వైండింగ్ కోసం 40 అడుగులు రెసిడెంటల్ ఏరియాలో.. పాత లే అవుట్ అయితే 30 అడుగులు, కొత్త లే అవుట్ 40 అడుగులు మరియు కమర్షియల్ ఏరియాలో 60 అడుగులు మేరకు రోడ్డు విస్తరణకు ఆదేశించియున్నారు.

టౌన్ ప్లానింగ్ అధికారి వారు చెప్పినట్లుగా రోడ్డు మార్జిన్ పొజిషన్ రిజిస్ట్రేషన్ చేసి అప్ లోడ్ చేయవలయును.
ఇట్టి రోడ్డు మార్టిన్ లో డ్రైనేజ్ ల కోసం.. . ఎలక్ట్రికల్ స్తంభాల కోసం ట్రాన్స్ ఫారం కోసం యన్జీటి గైడ్ లైన్స్ ప్రకారం మొక్కలు నాటుట కోసం వినియోగించబడుతుంది.

ఇంటి నిర్మాణముల కొరకు

1) రిజిష్టర్ డాక్యుమెంట్ 2) లింక్ డాక్యుమెంట్

3) ఈసీ సర్టిఫికేట్

4) ఆధార్ కార్డు

5) రోడ్డు వైండింగ్ రిజిస్టర్ డాక్యుమెంట్

పై డాక్యుమెంట్ పూర్తిగా అటెస్టేషన్ చేసి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. మీరు పొదిలి నగర పంచాయితీ నందు అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం చేపడితే ప్రభుత్వ ఉత్తర్వులు (00).ఎంయస్.నెంబర్. 119 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకొని సదరు అక్రమ కట్టడములకు విధ్ముత్ నీటి సరఫరా నిలిపి చేయబడును. కావున ప్రజలు పూర్తిగా అలోచించి స్థలముల కొనుగోలు/ ఇండ్ల నిర్మాణములు చేపట్టి పొదిలి నగర పంచాయితీ అభివృద్ధికి సహకరించవలసినదిగా నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ కోరారు

ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు