లాంఛనంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం
కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు లాంఛనంగా ప్రారంభించారు.వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు మండలానికి సంబంధించి వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా పొదిలి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి తొలి వ్యాక్సిన్ వేసుకున్ని లాంఛనంగా ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ భారత కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అనుగుణంగా జిల్లా అధికారులు సూచించిన ప్రాధాన్యత క్రమంలో తొలి విడత 181మందికి వ్యాక్సిన్ అందుబాటులో తీసుకుని వచ్చి వారి అందరికి రెండు రోజుల్లో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని…… వ్యాక్సిన్ నందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండలంలోని వైద్య అధికారులు మరియు ఐసిడిఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.