ఫలించిన శాసనసభ్యులు కుందూరు మంత్రాంగం కొనుగోలు నందు ధర పెరుగుదల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పొగాకు రైతులు
గత వారం రోజులుగా పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభించక పోవటంతో రంగంలోకి దిగిన స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి తన మంత్రాంగం తో పొగాకు వేలం కేంద్రంలో సరాసరి ధర పెరుగుదలతో పొగాకు రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.
శుక్రవారం నాడు స్థానిక పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి రేపటి నుంచి మంచి ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని రైతులకు హామీ ఇచ్చిన పిదప శనివారం నాడు పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ , శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పొదిలి వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం పూర్తి అయ్యే వరకు ఉండి సరాసరి ధర 153 రూపాయలు వచ్చేట్టు కృషి చెయ్యడం తో రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, శ్రీనివాస్, ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ యువజన సంఘం నాయకులు పిచ్చిరెడ్డి , శంకర్ రెడ్డి , వినోద్ తదితరులు పాల్గొన్నారు